News January 24, 2025
వేసవిలో నిరంతర విద్యుత్కు చర్యలు: Dy.CM భట్టి
రానున్న వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. HYDలోని ప్రజాభవన్లో విద్యుత్ అధికారులతో నిర్వహించిన 2025 యాక్షన్ ప్లాన్లో Dy.CM మాట్లాడారు. జిల్లా, మండల విద్యుత్ అధికారులు ఇప్పటి నుంచే ఆ విధంగా సన్నద్ధం అవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 24, 2025
ఖమ్మం: గ్రామసభల ఆప్డేట్
ఖమ్మం జిల్లాలోని 589 గ్రామపంచాయతీలలో మూడు రోజులపాటు గ్రామసభలు నిర్వహించారు. గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా నాలుగు పథకాలకు 1,42,682 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారుల లిస్ట్లో అర్హుల పేర్లు లేకపోతే మరోమారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో దరఖాస్తులు సమర్పించేందుకు గ్రామసభల వద్ద జనం బారులు తీరారు. సభలు నేడు చివరి రోజు కావడంతో దరఖాస్తులపై మరింత స్పష్టత రానుంది.
News January 24, 2025
ఖమ్మం: ఉద్యోగుల సమస్యలపై ఎంపీకి విన్నపం
టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా కమిటీ నూతనంగా ఏర్పాటైన సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీకి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి సమస్యలపై ఎంపీకి విన్నవించగా, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో టీన్జీవోస్ సభ్యులు పాల్గొన్నారు.
News January 23, 2025
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: పొంగులేటి
ప్రాథమిక లిస్టులో పేర్లు రానివారు ఆందోళన చెందొద్దని, తిరిగి దరఖాస్తు చేసుకుంటే పథకాలకు ఎంపిక చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేశవపురంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఓ పక్క అభివృద్ధితోపాటు మరోపక్క ప్రజలకు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందన్నారు.