News January 24, 2025
వేసవిలో నిరంతర విద్యుత్‌కు చర్యలు: Dy.CM భట్టి

రానున్న వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. HYDలోని ప్రజాభవన్‌లో విద్యుత్ అధికారులతో నిర్వహించిన 2025 యాక్షన్ ప్లాన్‌లో Dy.CM మాట్లాడారు. జిల్లా, మండల విద్యుత్ అధికారులు ఇప్పటి నుంచే ఆ విధంగా సన్నద్ధం అవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 15, 2025
KMM: ఎక్కడ చూసినా అదే చర్చ..!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
News February 15, 2025
ఖమ్మం జిల్లాలో రూ.598 కోట్ల పెండింగ్ కరెంట్ బిల్లులు

ఖమ్మం జిల్లాలో విద్యుత్తు బిల్లులు పేరుకుపోయాయి. విద్యుత్తుశాఖలో భారీ స్థాయిలో బకాయిలు పేరుకుపోయాయి. ప్రైవేట్, ప్రభుత్వశాఖల నుంచి మొత్తం రూ.598 కోట్ల బకాయిలున్నాయి. ఇంత మొత్తం బకాయిలు ఉండటంతో ఆ శాఖపై పెనుభారం పడుతోంది. సంబంధిత శాఖ బకాయిలను రికవరీ చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈ బకాయిల్లో సింహభాగం రూ.241 కోట్లు మిషన్ భగీరథవి ఉండటం గమనార్హం.
News February 14, 2025
నేలకొండపల్లి: అప్పుల బాధతో రైతు బలవన్మరణం

అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని మంగాపురం తండాలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తేజావత్ రామ(50) తనకున్న నాలుగు ఎకరాలకు తోడు మరికొంత కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పంట పెట్టుబడికి అప్పు చేశాడు.. ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో, అప్పు తీర్చే మార్గం లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు.