News April 18, 2024
వేసవి క్రీడా శిక్షణా శిబిరం నిర్వాహణకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరం నిర్వహణకు ఉత్సాహవంతులైన వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకట్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9182552593 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
Similar News
News December 5, 2025
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: రాణి కుముదిని

సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నర్సంపేట ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.

News December 4, 2025
వరంగల్: రిజర్వ్ స్టాఫ్‌తో ర్యాండమైజేషన్

జీపీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్‌ను జిల్లా పరిశీలకులు బాల మాయాదేవి, కలెక్టర్ సత్య శారదలు కలెక్టరేట్ వీసీ హాల్‌లో నిర్వహించారు. వరంగల్, నర్సంపేట డివిజన్ల మండలాల వారీగా సర్పంచ్, వార్డు స్థానాలకు ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోల కేటాయింపులు పూర్తయ్యాయి. స్థానికేతర సిబ్బందిని ప్రాధాన్యంగా ఎంపిక చేస్తూ, 91 పంచాయతీలకు 20% రిజర్వ్ స్టాఫ్‌తో ర్యాండమైజేషన్ జరిపారు.