News April 16, 2025

వేసవి టూర్.. మహబూబాబాద్‌లో చూడదగిన ప్రదేశాలివే

image

వేసవిలో చాలా మంది టూర్‌కి వెళ్తుంటారు. కానీ, కొంతమంది దూర ప్రదేశాలు కాకుండా దగ్గరలో ఒకే రోజులో వెళ్లి వచ్చే ప్రదేశాలకు వెళ్లొస్తారు. అయితే గిరిజన జిల్లా అయినటువంటి మహబూబాబాద్‌లో కురవి వీరభద్ర స్వామి ఆలయం, గుంజేడు ముసలమ్మ ఆలయం, అనంతాద్రి చెరువు, గూడూరు మినీ మేడారం జాతర, కంబాలపల్లి పురాతన శివాలయం వంటి ప్రదేశాలకు ప్రజలు వెళ్లి చూడవచ్చు. వీటిలో మీరు ఎక్కడికి వెళ్దామనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Similar News

News January 9, 2026

NZB: కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసిన ఎంపీ అరవింద్

image

నిజామాబాద్ కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ భేటీలో జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులపై వారు చర్చించారు. నూతన కలెక్టర్‌కు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

News January 9, 2026

ట్రంప్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

image

ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తొలిసారి స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేస్తున్న హెచ్చరికలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘కోపిష్టి అయిన ట్రంప్ చేతులు ఇరాన్ పౌరుల రక్తంతో తడిచాయి. అతను స్వదేశంలోని సమస్యలపై ఫోకస్ చేయడం మంచిది. వేరే దేశాధ్యక్షుడి మెప్పుకోసం ఇరాన్‌లో నిరసనకారులు తమ వీధులను పాడు చేసుకుంటున్నారు’ అని అసహనం వ్యక్తం చేశారు.

News January 9, 2026

సిద్దిపేట: ‘అందరూ కలిసి టీం వర్క్ చేయాలి’

image

అందరూ కలిసి టీం వర్క్ చేయాలని సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ అన్నారు. సిద్దిపేట్ నూతన పోలీస్ కమిషనరేట్లో పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి తదనంతరం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ అధికారులతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. అందరూ కలిసి టీం వర్క్ చేయాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు.