News April 5, 2025
వేసవి రద్దీ నియంత్రణకు సింహాచలం మీదుగా ప్రత్యేక రైళ్ళు

వేసవి రద్దీ దృశ్య రద్దీని అరికట్టేందుకు సింహాచలం, దువ్వాడ మీదుగా ప్రత్యేక రైలు నడపనట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. షాలిమర్ -చెన్నై వీక్లీ ఎక్స్ ప్రెస్ (02841/42) రైళ్ళు ఏప్రిల్ 7,14,21 తేదీలలో షాలిమర్ నుంచి సింహాచలం మీదుగా చెన్నై వెళ్ళనున్నట్లు పేర్కొన్నారు. తిరిగి ఏప్రిల్ 9,16,23 తేదీలలో చెన్నై నుంచి సింహాచలం మీదుగా షాలిమర్ వెళ్ళనున్నట్లు వెల్లడించారు.
Similar News
News November 28, 2025
విశాఖ బాలోత్సవం పోస్టర్ ఆవిష్కరణ

విశాఖలో బాలోత్సవం పోస్టర్‌ను జీవీఎంసీ కమీషనర్ కేతన్ గార్గ్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈసారి ఉత్సవాలు విశాఖ వ్యాలీ రోటరీతో కలిసి నిర్వహిస్తున్నామని బాలోత్సవం కార్యదర్శి రాజేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే కలెక్టర్, జీవీఎంసీ కమీషనర్, DEO, నగరంలోని 56 మంది ప్రముఖులతో ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
News November 28, 2025
APPSC లెక్చరర్ ఫలితాల విడుదల కోసం అభ్యర్థుల విజ్ఞప్తి

APPSC జూలైలో నిర్వహించిన డిగ్రీ లెక్చరర్ పరీక్షా ఫలితాలను త్వరగా విడుదల చేయాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డా.వేపాడ చిరంజీవిరావుని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం విశాఖపట్నంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీలు భర్తీ చేయాలని అభ్యర్థించారు. సమస్యపై చర్యలు తీసుకుంటానని చిరంజీవిరావు తెలిపారు.
News November 28, 2025
కేజీహెచ్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్ ప్రారంభం

కేజీహెచ్‌లోని గైనిక్ వార్డులో బాలింతల కోసం బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్ ప్రాజెక్ట్‌ను ఆయుష్మాన్‌లో భాగంగా ఏర్పాటు చేశారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి ఈ యూనిట్ ప్రారంభించారు. ఈ యూనిట్‌తో పిల్లల తల్లులకు అన్ని రకాల ఉపయోగాలు చేకూరుతాయని సూపరింటెండెంట్ వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వైద్యులు, సిబ్బంది, నిర్వాహకులు పాల్గొన్నారు.


