News April 10, 2025
వేసవి రద్దీ మేరకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

వేసవిలో ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా SMVT బెంగుళూరు(SMVB), నారంగి(NNGE) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 15 నుంచి 29 వరకు ప్రతి మంగళవారం SMVB-NNGE(నెం.06559), ఏప్రిల్ 12 నుంచి మే 3 వరకు ప్రతి శనివారం NNGE- SMVB(నం.06560) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News December 10, 2025
MLAల జీతాలు భారీగా పెంచిన ఒడిశా

ఒడిశాలో MLAల జీతాలు భారీగా పెరిగాయి. తమ జీతాన్ని దాదాపు మూడు రెట్లు పెంచే బిల్లుకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. జీతం, అలవెన్సులతో కలిపి గతంలో నెలకు రూ.1.11లక్షలు ఉండగా ఇప్పుడు ఇది ఏకంగా రూ.3.45 లక్షలకు చేరింది. దీంతో దేశంలో MLA జీతం అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ఇప్పటివరకూ ఈ స్థానంలో తెలంగాణ ఉండేది. ఇక్కడి శాసనసభ్యుల జీతం రూ.2.5లక్షలుగా ఉంది. MLA జీతం పెంపుపై మీ కామెంట్?
News December 10, 2025
సిరిసిల్ల: ‘గౌరవప్రదమైన జీవితానికి హక్కులే ఆధారం’

ప్రతి మనిషి గౌరవంగా జీవించేందుకు మానవ హక్కులు మూలాధారమని సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు జె.శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ ఆదేశాల మేరకు తంగళ్లపల్లిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమం నిర్వహించింది. హక్కులు తెలుసుకొని, ఇతరుల హక్కులను గౌరవించాలని సీనియర్ సివిల్ జడ్జి పి. లక్ష్మణాచారి సూచించారు.
News December 10, 2025
కాకినాడలో సౌత్ జోన్ వాలీబాల్ పోటీలు ప్రారంభం

కాకినాడ JNTUలో బుధవారం సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ గణబాబు ఈ పోటీలను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనడానికి తరలివచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కలెక్టర్ షామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.


