News April 16, 2025

వేసవి సెలవులు.. జనగామ జిల్లాలో టూరిజం ప్లేసెస్ ఇవే

image

వేసవిలో చాలా మంది టూర్ వెళ్దామనే ఆలోచనతో ఉంటారు. కానీ, కొంతమంది దూర ప్రదేశాలు కాకుండా దగ్గరలో ఒకే రోజులో వెళ్లి వచ్చే వాటిని ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే జనగామలో కొన్ని టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. పాలకుర్తి సోమేశ్వర ఆలయం, చీటకోడూరు డ్యాం, బొమ్మెర పోతన స్మారక స్థలం, జీడికల్ రాముల వారి టెంపుల్, వల్మిడి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయం లాంటి కొన్ని చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి.

Similar News

News April 19, 2025

కలెక్టర్& SPలతో సమావేశమైన మంత్రి భరత్

image

అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి టీజీ భరత్‌ను జిల్లా కలెక్టర్ వినోద్, ఎస్పీ జగదీశ్ శుక్రవారం కలిశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మంత్రి భరత్ గంటపాటు సమీక్షించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రి కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీల పర్యవేక్షణలో జిల్లా ప్రభుత్వ అధికారుల పనితీరు బాగుందని మంత్రి కొనియాడారు.

News April 19, 2025

కామారెడ్డి: ఏపీ మంత్రిని కలిసిన ప్రభుత్వ సలహాదారు

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శనివారం హైదరాబాద్‌లోని హాజ్ హౌస్‌లో ఆంధ్రప్రదేశ్ మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హజ్ యాత్రకు వెళ్లే ఇరు రాష్ట్రాల యాత్రికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఇరువురు చర్చించారు. అంతకుముందు మంత్రిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శాలువా కప్పి సత్కరించారు.

News April 19, 2025

కామారెడ్డి: కఠిన శిక్షలు పడితేనే నేరాలు తగ్గుతాయి: SP

image

నేరాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు పడినప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుందని KMR జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన కోర్టు డ్యూటీ పోలీసు అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా కోర్టు డ్యూటీ అధికారులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. వారెంట్లు, సమన్లు వేగంగా ఎగ్జిక్యూట్ చేసి ట్రయల్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

error: Content is protected !!