News April 6, 2024
వేసవి సెలవులు.. ప్రశ్నార్థకంగా బడుల భద్రత
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్మెన్లు లేరు. గతంలో ఉన్న వారు పదవీ విరమణ పొందగా, వీరి స్థానంలో కొత్త వారిని గత ప్రభుత్వం నియమించలేదు. వీటన్నింటి నేపథ్యంలో కొన్ని చోట్ల పాఠశాలల పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.
Similar News
News January 19, 2025
వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇస్తాం: Dy.CM భట్టి
తెలంగాణలో ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ అమలవుతుందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ఎర్రుపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భట్టి మాట్లాడుతూ.. భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రూ.12వేలు అందజేస్తామని స్పష్టం చేశారు. గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వివరించారు.
News January 19, 2025
బుగ్గపాడులో దంపతులు సూసైడ్.. ఆప్డేట్
సత్తుపల్లి మండలం బుగ్గపాడులో<<15185005>> కృష్ణ, సీత దంపతులు <<>>చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కృష్ణారావు లారీ, ఆటో, డీసీఎం కొనగా అవి ప్రమాదాలు, మరమ్మతులకు గురవడంతో అమ్మేశాడు. ఈక్రమంలో ఇల్లు గడవక, ఆదాయ మార్గం లేక ఇబ్బందిపడ్డాడు. తండ్రి పరిస్థితిని చూసి కుమార్తెలు సాయపడేవారు. వారిని ఇబ్బంది పెట్టలేక కృష్ణారావు దంపతులిద్దరూ చనిపోవాలని నిర్ణయించుకుని.. రావి చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్నారు.
News January 19, 2025
ఖమ్మం ఖిల్లా వెయ్యేళ్ల చరిత్ర ఇదే..!
ఖమ్మం ఖిల్లాకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. క్రీ.శ 997లో గజపతులతో పాటు ఖమ్మం వచ్చిన కొండాపురానికి చెందిన అక్కిరెడ్డి, అస్కారెడ్డి కోట నిర్మాణం ప్రారంభించగా.. క్రీ.శ. 1006లో నిర్మాణం పూర్తయింది. 1531లో సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్‌ను ఓడించి కోటను స్వాధీనపరుచుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఖిల్లా కుతుబ్ షాహీల పాలనలోకి వెళ్లింది. 17వ శతాబ్దంలో ఆసఫ్ జాహీల ఆధీనంలోకి పోయింది.