News October 8, 2024

‘వైఎస్సార్ జిల్లా పేరును మార్చడం తగదు’

image

వైఎస్సార్ జిల్లా పేరును కడప జిల్లాగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నించడం తగదని వైసీపీ జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు వెలకట్టలేనివని, ఆ సేవలకు గుర్తింపుగానే ఆయన పేరు పెట్టారన్నారు. కడప జిల్లాగా పేరు మార్చాలని పక్క జిల్లాకు చెందిన మంత్రి సీఎంకు లేఖ రాయడం హేయమైన చర్య అన్నారు.

Similar News

News December 11, 2025

విజేత కడప జట్టు

image

పులివెందుల పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంటులో కడప జట్టు విజేతగా నిలిచింది. గురువారం కడప, విశాఖపట్నం జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కడప జట్టు గెలుపొందింది. రెండో స్థానంలో విశాఖ, తృతీయ స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా జట్టు నిలిచింది. ఆయా జట్ల విజేతలకు MLC రాంగోపాల్ రెడ్డి బహుమతులను అందజేశారు.

News December 11, 2025

కడప మేయర్ ఎన్నికకు టీడీపీ దూరం: వాసు

image

కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి (వాసు) స్పష్టం చేశారు. గురువారం ఆయన కడపలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో మెంబర్ ఎమ్మెల్యే మాధవి, టీడీపీ సభ్యులైన పలువురు కార్పొరేటర్లు ఈ ఎన్నిక సమావేశానికి హాజరు కావడం లేదన్నారు.