News December 8, 2024
వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డికి 41ఏ నోటీసు
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రవీంద్రారెడ్డి కేసుకు సంబంధించి ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి మరోసారి పులివెందుల పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులలో సోమవారం ఉదయం 10 గంటలకు కడప సైబర్ సెల్ కార్యాలయానికి హాజరుకావాలని పేర్కొన్నారు. గతంలో కూడా పులివెందుల పోలీసులు రాఘవరెడ్డికి నోటీసులు అందించారు. అయితే రాఘవరెడ్డి విచారణకు హాజరు కాలేదు.
Similar News
News December 27, 2024
ఇడుపులపాయలో వింతాకృతిలో పుట్టగొడుగు
వేంపల్లి మండలం ఇడుపులపాయ గ్రామ సమీపంలోని కొండ్రుతు వంకలో శుక్రవారం మనిషి కాలి ఆకృతిలో పుట్టగొడుగు దర్శనమిచ్చింది. ఈ పుట్టగొడుగును చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి చూపుతున్నారు. నెలరోజుల క్రితం ఇదే ప్రాంతంలో మనిషి చేతివేళ్ల ఆకారంలో పుట్టగొడుగు బయటపడిన విషయం తెలిసిందే. ఈ విషయమై హెచ్ఓ రెడ్డయ్యను వివరణ కోరగా.. జన్యు లోపంతో ఇలాంటి పుట్టగొడుగులు పుట్టుకొస్తాయన్నారు.
News December 27, 2024
కడప నుంచి హైదరాబాదు, విజయవాడకు స్లీపర్ బస్సులు
కడప పట్టణం నుంచి హైదరాబాదు, విజయవాడ దూర ప్రాంతాలకు స్టార్ లైన్ స్లీపర్ బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో RM గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కడప నుంచి హైదరాబాదు, విజయవాడ ప్రాంతాలకు ప్రతిరోజు రాత్రి9 గంటలకు బస్సులు బయలుదేరుతాయని వెల్లడించారు. ప్రయాణికులు సౌకర్యవంతంగా నిద్రిస్తూ ప్రయాణం చేసే విధంగా రూపొందించినట్లు వివరించారు. ప్రజలు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News December 27, 2024
కడప: ఆ రైలు 2 నెలలు రద్దు
తిరుపతి-హుబ్లీ ప్యాసింజర్ రైలు సేవలను 28వ తేదీ నుంచి రద్దు చేసి, కుంభమేళా ఉత్సవాలకు పంపుతున్నట్లు రైల్వే అధికారి జనార్దన్ తెలిపారు. ఈ రైలు ఉమ్మడి కడప జిల్లాలోని బాలపల్లె, శెట్టిగుంట, ఓబులవారిపల్లి, పుల్లంపేట, రాజంపేట, హస్తవరం, నందలూరు, మంటపంపల్లె, ఒంటిమిట్ట, భాకరాపేట, కనుమలోపల్లి, కడప, కృష్ణాపురం, గంగాయపల్లె, కమలాపురం, ఎర్రగుడిపాడు, ఎర్రగుంట్ల, ముద్దనూరు, మంగపట్నం, కొండాపురం మీదుగా ప్రయాణిస్తుంది.