News February 5, 2025

వైఎస్ జగన్‌ను కలిసిన ఆలూరు ఎమ్మెల్యే.. ఈరన్న హత్యపై చర్చ

image

వైసీపీ అధ్యక్షుడు వైస్ జగన్మోహన్ రెడ్డిని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి మంగళవారం కలిశారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో కలిసి మాట్లాడారు. ఆలూరు నియోజకవర్గం అరికేర గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ కురువ ఈరన్న హత్యపై చర్చించారు. ఈ ఘటనపై జగన్‌ స్పందిస్తూ.. కురువ ఈరన్న కుటుంబానికి పార్టీ నుంచి సహాయం అందిస్తామని తెలిపారు. త్వరలో అరికేరలో పర్యటిస్తారని పేర్కొన్నారు.

Similar News

News January 22, 2026

వైద్యవిద్యా పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: సత్యకుమార్

image

AP: వైద్యవిద్యా పరీక్షలు మరింత పకడ్బందీగా, పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. NTR హెల్త్ వర్సిటీలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ‘37 GOVT, PVT వైద్య కళాశాలల CC కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానించాం. విద్యార్థుల ప్రతి కదలిక కంప్యూటర్లలో నిక్షిప్తం అవుతుంది. వర్సిటీ నిర్వహించే అన్ని పరీక్షలను దశల వారీగా వీటితో పరిశీలిస్తాం’ అని చెప్పారు.

News January 22, 2026

అపరిచితులతో స్నేహాలు ప్రమాదం: ఎస్పీ

image

అపరిచితులతో స్నేహాలు ఎప్పటికైనా ప్రమాదమేనని ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. ఆన్లైన్ ఫ్రెండ్స్‌తో జాగ్రత్తగా ఉండాలని గురువారం సూచించారు. సోషల్ మీడియాలో అపరిచితుల రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయొద్దని పేర్కొన్నారు. ఎవరిని నమ్మి ఫొటోలు, వీడియోలు పంపించవద్దన్నారు. ఒకవేళ ఆన్లైన్‌లో వేధింపులకు గురి చేస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు.

News January 22, 2026

పిల్లలకు SM వాడకంపై బ్యాన్ విధించే యోచనలో ఏపీ ప్రభుత్వం?

image

ఆంధ్రప్రదేశ్‌లో 16ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. AUS ప్రభుత్వం అమలు చేసిన SM బ్యాన్ నమూనాను ఏపీలో కూడా అధ్యయనం చేస్తున్నట్లు దావోస్‌లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. చిన్నారుల మానసిక ఆరోగ్యం, ఆన్‌లైన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని వారు SMను వాడకుండా ఉండేలా చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు చెప్పారు.