News April 6, 2025
వైఎస్ జగన్ అనంతపురం పర్యటన ఖరారు

మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు పర్యటన ఖరారైంది. ఈ నెల 8న పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఆయన పర్యటించనున్నారు. ఇటీవల ప్రత్యర్థుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ పర్యటన వేళ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైసీపీ కీలక నేతలు శనివారం సమావేశం నిర్వహించి చర్చించారు.
Similar News
News April 18, 2025
గుమ్మగట్ట: కరెంట్ షాక్‌తో టెన్త్ విద్యార్థి మృతి

గుమ్మగట్ట మండలం గొల్లపల్లిలో గురువారం రాత్రి విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి కార్తీక్ (16) ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. తండ్రితో కలిసి కుమారుడు పొలానికి వెళ్లాడు. మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. యువకుడు గత నెలలోనే పది పరీక్షలు రాశాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు.
News April 18, 2025
కియా ఇంజిన్ల చోరీ.. కీలక అప్‌డేట్

పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో 900 కారు ఇంజిన్ల చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇక్కడ చోరీ చేసిన ఇంజిన్లను తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో విక్రయించినట్లు సమాచారం. కొనుగోలుదారులు ఎవరన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు ఇప్పటికే అరెస్టైన వారిని త్వరలో కస్టడీకి తీసుకొని విచారించనున్నారు.
News April 18, 2025
SKU అధ్యాపకురాలికి గిన్నిస్ బుక్‌లో చోటు

శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ విభాగం అధ్యాపకురాలు పూజిత అద్భుత ప్రతిభ కనబరిచి గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు. సంగీత వాయిద్య ప్రదర్శనలో ఆమె ఆ ఘనత సాధించారు. కీబోర్డ్ ఉపయోగించి సంగీతంలో మంచి ప్రతిభ కనబరిచిన పూజితకు హైదరాబాదులో ఈ అవార్డు అందచేశారు.