News April 6, 2025

వైఎస్‌ జగన్‌ రాప్తాడు పర్యటన ఖరారు

image

మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ రాప్తాడు పర్యటన ఖరారైంది. ఈ నెల 8న పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఆయన పర్యటించనున్నారు. ఇటీవల ప్రత్యర్థుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన లింగమయ్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించనున్నారు. వైఎస్‌ జగన్‌ పర్యటన వేళ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైసీపీ కీలక నేతలు శనివారం సమావేశం నిర్వహించి చర్చించారు.

Similar News

News April 22, 2025

ప్రతి వాహనాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి:  ADB SP

image

ప్రతి వాహనాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీసు అధికారుల వాహనాల డ్రైవర్లకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని సూచనలు చేశారు. ప్రతి వాహనంలో కెమెరాలు చేశామన్నారు. వాటిని సరైన విధంగా పద్ధతిలో ఉంచుకోవాలని తెలియజేశారు.

News April 22, 2025

NZB:  జిల్లా నూతన జడ్జిని కలిసిన పోలీస్ కమిషనర్

image

నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన G.V.N. భరతలక్ష్మిని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య మంగళవారం నిజామాబాద్ జిల్లా కోర్టు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పువ్వుల మొక్కను అందజేశారు. ఇరువురు పాలనా పరమైన అంశాలపై చర్చించారు. అనంతరం జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితులను నూతన జడ్జీకి సీపీ వివరించారు.

News April 22, 2025

హిరోషిమాలో అణుబాంబు మృతులకు CM రేవంత్ నివాళులు

image

తెలంగాణ CM రేవంత్ జపాన్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన ఇవాళ హిరోషిమా పీస్ మెమోరియల్ పార్కును సందర్శించి అణుబాంబు మృతులకు నివాళులు అర్పించారు. అలాగే, దాడి జరిగిన ప్రాంతంలో శాంతికి చిహ్నంగా ఏర్పాటు చేసిన డోమ్‌ను సైతం సందర్శించారు. CMతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, జపాన్ ప్రతినిధులు ఉన్నారు. 1945లో 2వ ప్రపంచ యుద్ధం వేళ జపాన్‌పై US అణుబాంబుతో దాడి చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!