News April 10, 2025

వైఎస్ జగన్ రామగిరి పర్యటన.. కేసు నమోదు

image

మాజీ సీఎం వైఎస్ జగన్ రామగిరి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద పోలీసుల మీద దాడి ఘటనపై కేసు నమోదైంది. వైసీపీ శ్రేణులు హెలికాప్టర్ వద్దకు దూసుకెళ్లగా అడ్డుకోబోయిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ రంగారెడ్డి అస్వస్థతకు గురై అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు సీకేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News April 18, 2025

వసతి గృహంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ తనిఖీ

image

MBNR జిల్లా కేంద్రంలోని బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యపై దృష్టి పెట్టి చదువులో బాగా రాణించాలని విద్యార్థులకు సూచించారు. విద్యతోపాటు ఇంటి దగ్గర తల్లిదండ్రులకు సహాయంగా ఉండాలని చెప్పారు. 

News April 18, 2025

‘అద్భుత శిల్ప సంపద మన మెదక్’

image

మెదక్ జిల్లాలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నట్లు యువ చరిత్ర పరిశోధకుడు సంతోష్ తెలిపారు. అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం సందర్బంగా మాట్లాడుతూ.. వేల్పుగొండ తుంబురేశ్వర స్వామి ఆలయం, వెల్దుర్తి కాకతీయ కళాతోరణం, కొంటూరు మసీద్, సీఎస్ఐ చర్చి లాంటి ఎన్నో అద్భుతమైన పురాతన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాలగర్భంలో కలిసిపోతున్న అత్యద్భుతమైన శిల్ప సంపద మెదక్ జిల్లాలో ఉందన్నారు.

News April 18, 2025

IPL: అభిషేక్ జేబులు చెక్ చేసిన సూర్య కుమార్

image

MI, SRH మధ్య నిన్న ముంబై వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. SRH ఓపెనర్ అభిషేక్ శర్మ జేబులను సూర్యకుమార్ యాదవ్ చెక్ చేశారు. ఇటీవల పంజాబ్‌పై సెంచరీ చేసిన అనంతరం అభిషేక్ జేబులోంచి నోట్ తీసి ఆరెంజ్ ఆర్మీకి అంకితమంటూ సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటి మ్యాచ్‌లోనూ అలానే నోట్ రాసుకొచ్చారేమో అని SKY చెక్ చేయడం గ్రౌండ్‌లో నవ్వులు పూయించింది.

error: Content is protected !!