News January 12, 2025
వైజాగ్‌లో ఒప్పో రెనో 13 సిరీస్ లాంఛ్

ఒప్పో రెనో 13 సిరీస్ మొబైల్ ఫోన్‌ను విశాఖ డాబా గార్డెన్స్ సెల్ పాయింట్ నందు నిర్వహించిన కార్యక్రమంలో సినీనటి డింపుల్ హయాతి మార్కెట్లోకి విడుదల చేశారు. చైర్మన్ మోహన్ ప్రసాద్ పాండే మాట్లాడుతూ.. సంక్రాతి సందర్బంగా ప్రత్యేక రాయితీలు, లక్కీ డ్రా అందుబాటులో ఉందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెల్ పాయింట్ డైరెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 19, 2025
మధురవాడ: మహిళ హత్య కేసులో నిందితుల అరెస్ట్

మధురవాడలో బుధవారం మరో సంచలనం చోటుచేసుకుంది. ఒడిశాలో ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసి మధురవాడలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉంటున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా పోలీసులు టవర్ లొకేషన్ ఆధారంగా వారిని గుర్తించారు. వెంటనే పీఎంపాలెం పోలీసుల సహాయంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పీఎంపాలెం పోలీసులు ఒడిశా పోలీసులకు వారిని అప్పగించారు.
News February 19, 2025
ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మకే టీడీపీ మద్దతు: ఎంపీ

కష్టకాలంలో నిలబడ్డవారికి సపోర్ట్ చేయాలని విశాఖ MP శ్రీభరత్ అన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆదేశానుసారం ప్రస్తుత MLC రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. జనసేన కూడా మద్దతు తెలిపిందని బీజేపీతో చర్చిస్తామని వెల్లడించారు. కాగా.. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల సమయంలో TDP బలపరిచిన వేపాడ చింరజీవి గెలుపులో రఘువర్మ కీలక పాత్ర పోషించారు.
News February 19, 2025
విశాఖ: పెళ్లి జరిగిన రెండు వారాలకే పరార్

నవ వధువు పారిపోయిన ఘటన ఏలూరులో వెలుగు చూసింది. బాధితుడి వివరాల మేరకు.. ఏలూరు గజ్జలవారి చెరువుకు చెందిన శివనాగ సాయికృష్ణ, విశాఖ కంచరపాలేనికి చెందిన బోడేపు చంద్రహాసినితో జనవరి 31న పెళ్లి జరిగింది. వారం క్రితం బిట్టుబారు సమీపంలో కాపురం ప్రారంభించారు. ఈనెల 16న రాత్రి భర్త నిద్రపోయాక భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. 4 కాసుల గోల్డ్ చైన్, ఉంగరం, వెండి పట్టీలతో ఆమె పారిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.