News March 30, 2025

వైజాగ్ మ్యాచ్ చూసేందుకు జైషా

image

విశాఖ వేదికగా జరుగుతున్న SRH-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను చూసేందుకు ఐసీసీ ఛైర్మన్ జై షా స్టేడియానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రి లోకేశ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఆయన వచ్చిన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ఏసీఏ అధికారుల చేశారు. వచ్చే విమెన్స్ వరల్డ్ కప్ టోర్నీ విశాఖలో జరిపేందుకు సన్నాహాలు జరుపుతున్న నేపథ్యంలో ఆయన స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 

Similar News

News November 28, 2025

డిసెంబర్ నెలలో రేషన్ డిపోలలో రాగుల పంపిణీ: విశాఖ జేసీ

image

డిసెంబర్ నెలలో రేషన్ డిపోలలో రాగులు పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శుక్రవారం తెలిపారు. లబ్ధిదారులకు మూడు కేజీల బియ్యానికి బదులుగా మూడు కేజీల రాగులు అందజేయనున్నట్లు వెల్లడించారు. రేషన్ డిపోలకు వెళ్లే లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News November 28, 2025

విశాఖ జూ పార్కుకు కొత్త నేస్తాల రాక

image

విశాఖ జూ పార్కుకు జంతు మార్పిడి విధానంలో కొత్త జంతువులు తీసుకొచ్చారు. జార్ఖండ్ రాష్ట్రం బిర్ష జూ పార్కు నుంచి హిమాలయన్ నల్లని ఎలుగుబంట్లు, గరియల్, స్పార్టెడ్ డవ్, సిల్వర్ పీజంట్ అనే జంతువులను, పక్షులను విశాఖ జూకు తీసుకొచ్చినట్లు క్యూరేటర్ జీ.మంగమ్మ తెలిపారు. విశాఖ జూ నుంచి కొన్ని జంతువులను అక్కడి జూకి పంపించినట్లు చెప్పారు. కొత్తగా వచ్చిన వీటిని కొన్ని రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతామన్నారు.

News November 28, 2025

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఫోరమ్‌కు 21 వినతులు

image

జీవీఎంసీలో శుక్రవారం నిర్వహించిన ‘టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్’కు 21 వినతులు వచ్చినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకారరావు తెలిపారు. సాధారణ స్పందనలో రద్దీ తగ్గించేందుకు ప్రతి శుక్రవారం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జోన్-3 నుంచి అత్యధికంగా 7 అర్జీలు రాగా.. స్వీకరించిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.