News April 21, 2025
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో 170 మంది తొలగింపు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి మరో 170 మందినియాజమాన్యం తొలగించింది. ఇప్పటివరకు 1500 వరకు ఉద్యోగులను తొలగించారు. అయితే కార్మిక సంఘాలతో జరిగిన చర్చల్లో మే 20వరకు ఎటువంటి చర్యలు ఉండవని చెప్పిన యాజమాన్యం తొలగింపులు ఆపడం లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కాగా ఉన్నపలంగా ఉద్యోగాలు పోవడంతో కార్మికులు బోరున విలపిస్తున్నారు.
Similar News
News April 22, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ మణుగూరు సీఐ, రిపోర్టర్✓ఉపఎన్నిక వస్తే భద్రాచలంలో గులాబీ జెండా ఎగురుతుంది: ఎమ్మెల్సీ కవిత ✓బూర్గంపాడులో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి ✓మణుగూరులో ఆటో బోల్తా.. స్వల్ప గాయాలు ✓ఆపరేషన్ థియేటర్లో ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే ✓ములకలపల్లిలో ఉపాధి హామీ పనులు పరిశీలించిన డీపీఓ
News April 22, 2025
‘ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్య’

ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్యను నేర్చుకుని మంచి ప్రయోజకులు కావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారని, నిర్ణీత విద్య అర్హతలతోపాటు పోటీ పరీక్షలలో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయులుగా పాఠశాలలో నియమించడం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందన్నారు.
News April 22, 2025
48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు: ఉత్తమ్

TG: రబీ సీజన్‌లో ధాన్యం దిగుబడికి అనుగుణంగా గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. రైతు మహోత్సవంలో ఆయన మాట్లాడారు. పంట చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం నీటి పారుదల రంగంపై రూ.81వేల కోట్లు వెచ్చించినా ఏమీ సాధించలేదని దుయ్యబట్టారు.