News August 17, 2024

వైద్యులు, నర్సుల భద్రతకు కట్టుబడి ఉన్నాం: మంత్రి దామోదర్

image

ప్రైవేటు ఆసుపత్రుల పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, సిబ్బంది భద్రతపై శుక్రవారం ఉన్నతాధికారులు, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు.

Similar News

News February 27, 2026

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం: కలెక్టర్ ప్రతిమా సింగ్

image

రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని, పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.

News February 27, 2026

మెదక్ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్

image

మెదక్ నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్‌ను టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి, మొక్కను అందజేశారు. గతంలో తాను అదనపు కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ఉద్యోగులు అందించిన సహకారాన్ని కలెక్టర్ గుర్తుచేసుకున్నారు. అదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె సూచించారు.

News February 27, 2026

మెదక్: కలెక్టర్‌‌ను కలిసిన ఎస్పీ

image

మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్‌ను ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలను వివరించారు.