News April 10, 2025
వైద్యుల నిర్లక్ష్యంతో గర్భస్థ శిశువు మృతి: బాధితులు

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు తాండూరు ఆరోగ్య కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. వారి వివరాలిలా.. తాండూరు మం. గౌతపూర్‌కి చెందిన ఆశమ్మ పురిటినొప్పులతో తాండూరు MCHలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భంలో శిశువు గుండె కొట్టుకోవడం లేదని స్కానింగ్‌కు బయటకు పంపించారు. స్కానింగ్ చేసుకుని ఆసుపత్రికి రాగా గర్భంలోనే శిశువు మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
Similar News
News April 17, 2026
BREAKING: తగ్గిన బంగారం ధర

కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు అక్షయ తృతీయ ముంగిట తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,370 తగ్గి రూ.1,54,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,250 పతనమై రూ.1,41,350 పలుకుతోంది. సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,75,000గా ఉంది.
News April 17, 2026
మాట్లాడే విధానం ఎంతో కీలకం

ఏదైనా చర్చలో పాల్గొన్నప్పుడే మనిషి వ్యక్తిత్వం బయటపడుతుంటుంది. అందుకే ఉద్యోగ నియామకాల్లో గ్రూప్ డిస్కషన్లు పెడుతుంటారు. అలాంటప్పుడు తోటివారికి అవకాశం ఇవ్వకుండా మీరే మాట్లాడకూడదు. మీరు చెప్పాలనుకున్నది వివరిస్తూనే ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి. దానివల్ల ఒకరి అభిప్రాయాలు మరొకరికి స్పష్టంగా తెలిసి చర్చ అర్థవంతంగా ముగుస్తుంది. అలాగే ఆలుమగల మధ్య కూడా ఏదైనా సమస్య వస్తే భాగస్వామికీ మాట్లాడే ఛాన్సివ్వాలి.