News July 25, 2024
వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నందు గురువారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. వైద్య సిబ్బంది అధికారులు, ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ మాలతి పాల్గొన్నారు.
Similar News
News November 16, 2025
ఖమ్మం: లోక్ అదాలత్లో 4,635 కేసులు పరిష్కారం

కేసుల రాజీతో కక్షిదారుల సమయం, డబ్బు ఆదా అవుతుందని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. రాజగోపాల్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహించారు. మొత్తం 4,635 కేసులను పరిష్కరించారు. వీటిలో క్రిమినల్ కేసులు 596, ఈ పెట్టి కేసులు 2, 350, చెక్ బౌన్స్ 53, ఇతర కేసులు 1,636 ఉన్నాయి. పరిష్కారం చేసుకున్న కక్షిదారులకు పూల మొక్కలు, అవార్డులు బహూకరించారు.
News November 16, 2025
నేటి నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరగతులు

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఖమ్మం అధ్యయన కేంద్రంలో నేటి నుంచి వివిధ కోర్సుల తరగతులు ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మొహమ్మద్ జాకీరుల్లా తెలిపారు. నేటి నుంచి మార్చి 1 వరకు పీజీ ద్వితీయ సంవత్సర తరగతులు జరుగుతాయని, యూజీ సెమిస్టర్ 1, 3, 5 తరగతులు కూడా ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.
News November 16, 2025
ఖమ్మం జిల్లాలో 3.5 కోట్ల చేప పిల్లల విడుదల: కలెక్టర్

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 224 మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో 3.5 కోట్ల చేప పిల్లలను నీటి వనరుల్లో విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. చెరువుల్లో ఫీడ్ సక్రమంగా అందేలా, నీరు కలుషితంగాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 17 లక్షల చేప పిల్లలను ఉచితంగా విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రమాదాల్లో మృతి చెందిన కనకయ్య, మంగయ్య కుటుంబాలకు రూ.5 లక్షల బీమా చెక్కును అందజేశారు.


