News February 6, 2025
వైద్య శిబిరాన్ని సందర్శించిన ములుగు కలెక్టర్

ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మేడారం మినీ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన టీటీడీ కళ్యాణ మండపంలోని ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపంలోని ఏర్పాటు చేసిన పడకలను మందుల వివరాలను డీఎంహెచ్వో డా.గోపాలరావును అడిగి తెలుసుకున్నారు. మినీ జాతరకు వస్తున్న భక్తులకు వైద్యం పట్ల అసౌకర్యాలు కలగకుండా వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలన్నారు.
Similar News
News January 14, 2026
నెల్లూరు జిల్లాలో 1216 టీచర్ పోస్టులు ఖాళీ

నెల్లూరు జిల్లాలో 1,216 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. SA పోస్టులను 70 శాతం ప్రమోషన్స్‌తో, 30 శాతం DSCతో భర్తీ చేస్తారు. SAలు తెలుగు(54), సంస్కృతం(3), ఉర్దూ(22), హిందీ(35), ఆంగ్లం(44), MATHS(40), PS(22), BS(47), SS(64), PET(27), స్పెషల్ ఎడ్యుకేషన్(20) ఖాళీలు ఉన్నాయి. SGT కింద 786 పోస్టులు ఉండగా వీటిని DSC-2026లో భర్తీ చేసే అవకాశం ఉందని DEO బాలాజీ రావు వెల్లడించారు.
News January 14, 2026
భూపాలపల్లి: ముంగిట ముగ్గులు.. వీధిలో భోగి మంటలు

జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండగ తొలిరోజైన బుధవారం తెల్లవారుజామునే పల్లెలు, పట్టణాలు భోగి మంటల కాంతులతో మెరిసిపోయాయి. యువత చిందులు వేస్తూ సంబరాలు జరుపుకోగా, మహిళలు తమ ఇంటి ముంగిట తీరొక్క రంగులతో ముగ్గులు వేసి, గొబ్బెమ్మలతో అలంకరించారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం పట్టణాల్లో ఉండేవారు పల్లెలకు చేరుకోవడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
News January 14, 2026
WGL: 260 వార్డులు, 3,35,244 మంది ఓటర్లు!

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారాకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. ఆరు జిల్లాల పరిధిలో ఉన్న 12 మున్సిపాలిటీల్లోని 260 వార్డులకు సంబంధించి జాబితాను ఖరారు చేశారు. మొత్తం 3,35,244 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముసాయిదాపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈ తుది జాబితాను వెల్లడించడంతో ఎన్నికల కసరత్తు వేగవంతమైంది.


