News September 22, 2024

‘వైద్య సేవలు MBNRలో TOP.. NGKLలో NILL’

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 45 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ వైద్య సేవలను 20 ప్రైవేట్, 15 ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్నారు. ఇందులో అత్యధికంగా MBNRలోనే 14 ప్రైవేట్, 3 ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. WNPT-9,GDWL-4,NRPT-5 ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుతున్నాయి. NGKLలో ఒక్క ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులో లేవు.

Similar News

News October 16, 2024

గద్వాల్: ఎల్ఆర్ఎస్ సమస్యలను పరిష్కరించాలి:కలెక్టర్

image

గ్రామపంచాయతీ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాలులో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గ్రామీణస్థాయిలో ఉన్న LRS క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా చేయాలని సూచించారు.

News October 15, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాతం వివరాలు ఇలా…

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా చిన్నపురవపల్లి లో 13.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా కేతపల్లిలో 2.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా అలంపూర్ లో 1.3 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మాగనూరులో 0.5 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా సల్కర్పేటలో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News October 15, 2024

MBNR: నేటి నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

image

రాష్ట్ర ప్రభుత్వం శాఖ ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 220 బృందాలు ప్రధానంగా గేదెలు, ఆవులు, పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారులు ప్రత్యేక బృందాలను నియమించారు. పెంపకందార్లు పశువులకు ఉచితంగా ఈ టీకాలను వేసుకోవాలని అధికారులు తెలిపారు.