News April 25, 2024
వైభవంగా ఏడుపాయల వనదుర్గమ్మ పల్లకీసేవ
పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం ఏడుపాయల వనదుర్గ క్షేత్రంలో వైభవంగా పల్లకీసేవ నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో రాజగోపురం నుండి శివాలయం మీదుగా భక్తి శ్రద్దలతో ఊరేగించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈసందర్బంగా.. పాలక మండలి చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్, ధర్మకర్తలు వెంకటేశం, చక్రపాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 16, 2025
గజ్వేల్: అనాథలైన ముగ్గురు పిల్లలు
సిద్దిపేట జిల్లా బంగ్లావెంకటాపూర్ గ్రామంలో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. దర్శనం నర్సింలు-నాగమణి దంపతులకు ముగ్గురు కొడుకులు. నర్సింలు మతిస్తిమితం కోల్పోయి తిరుగుతుండగా.. ఆయన భార్య ఈ నెల 5న కిడ్నీ వ్యాధితో చనిపోయింది. దీంతో వారి పిల్లలు రాజేందర్(7), హరికృష్ణ(5), చందు(3) అనాథలుగా మారారు. వీరికి వృద్దురాలైన అమ్మమ్మ మాత్రమే తోడుగా ఉంది. దాతలు ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
News January 15, 2025
మెదక్: పోరాట యోధుడి జయంతి నేడు
1947లో ఇదే రోజు ప్రశ్నించే ఓ గొంతు జన్మించింది. 1960లో తొలిసారి ఆ కాలాతీత వ్యక్తి HYDలో అడుగుపెట్టారు. ఆయనే విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పిన జార్జ్‌రెడ్డి. 25ఏళ్ల వయసులో మార్క్స్, సిగ్మన్‌ఫ్రాయిడ్ వంటి ఫిలాసఫర్‌లను చదివేశారు. కేవలం ఉద్యమమే కాదు ఎదుటివారిని ఆలోచింపజేసే వక్త ఆయన. విద్యార్థి ఉద్యమం అంటే జార్జ్‌రెడ్డి గుర్తొచ్చేంతగా ఆయన పోరాటం.. ఓయూ నుంచే ప్రారంభం అవ్వడం హైదరాబాదీలకు గర్వకారణం.
News January 15, 2025
GET READY.. 18న నవోదయ ప్రవేశ పరీక్ష
నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు NVS ఈనెల 18న ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27 కేంద్రాలు ఏర్పాటు చేశామని వర్గల్ నవోదయ ప్రిన్సిపల్ తెలిపారు. వెబ్‌సైట్ www.Navodaya.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థి పుట్టిన తేదీ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.