News April 12, 2025

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని రథోత్సవం

image

ఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 7వ రోజు శనివారం రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ సీతారామలక్ష్మణ మూర్తులను అర్చకులు పట్టు వస్త్రాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి రథం పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.భక్తులు విశేషంగా తరలి వచ్చి కార్యక్రమాన్ని తిలకించారు.

Similar News

News December 12, 2025

కాజీపేటలో 103 చలాన్లు ఉన్న బైక్ సీజ్

image

కాజీపేట ట్రాఫిక్ పోలీసులు చర్చి వద్ద నిర్వహించిన తనిఖీల్లో 103 పెండింగ్ చలాన్లు ఉన్న ఒక బైక్‌ను గుర్తించారు. ఆ వాహనంపై మొత్తం ₹25,105 బకాయిలు ఉండటంతో, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న ఆదేశాల మేరకు ఆ వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు కనక చంద్రం, సంపత్ పాల్గొన్నారు.

News December 12, 2025

సంగారెడ్డి: ప్రశాంతంగా మొదటి విడత ఎన్నికలు: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు పోలింగ్ సిబ్బంది, పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు.

News December 12, 2025

నా వ్యక్తిత్వ హక్కులను కాపాడండి.. హైకోర్టులో పవన్ పిటిషన్

image

AP: తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ Dy.CM పవన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. AI వీడియోలతో పవన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా SMలో పోస్టులు చేస్తున్నారని ఆయన తరఫు లాయర్ తెలిపారు. దీంతో డిలీట్ చేసేందుకు ఆ లింక్‌లను 48hrsలోపు SM సంస్థలకు అందించాలని న్యాయమూర్తి సూచించారు. వాటిపై వారంలోపు చర్యలు తీసుకోవాలని గూగుల్, మెటా తదితర ప్లాట్‌ఫామ్‌లను ఆదేశిస్తూ తదుపరి విచారణను DEC 22కు వాయిదా వేశారు.