News October 30, 2024

వైభవంగా గోదావరి పుష్కరాలు నిర్వహించాలి: MP

image

గోదావరి పుష్కరాలు-2027కి సంబంధించి కొవ్వూరులో ఉన్న గోదావరిని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి బుధవారం పరిశీలించారు. జరగబోయే గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు ఈ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుస్మిత రాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 5, 2024

రాజోలు: వృద్ధుడి హత్య.. బంగారం, నగదు చోరీ

image

రాజోలు మండలం పొన్నమండ గ్రామంలో జగ్గారావు (93)ని హత్య చేసి ఇంట్లోని 22 గ్రాములు బంగారం, రూ.40 వేలు నగదు చోరీ చేశారని మృతుని మనవడు శ్రీకాంత్ ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని సీఐ నరేశ్ కుమార్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన సందీప్ హత్యకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. మృతుడి ఇంట్లో దొంగతనం కేసులో సందీప్ జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడని, ఆ కక్షతో వృద్ధుడిని హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు.

News November 5, 2024

కోనసీమ అబ్బాయి, కెనడా అమ్మాయి పెళ్లి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కెనడా అమ్మాయితో సోమవారం అమలాపురానికి చెందిన అబ్బాయితో పెళ్లి జరిగింది. అమలాపురానికి చెందిన మనోజ్ కుమార్ కెనడాకు చెందిన ట్రేసీ రోచే డాన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమలాపురం వచ్చిన కెనడా అమ్మాయి బంధువులు పెళ్లి ఇంట సందడి చేశారు. తెలుగు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. ఆ దేశస్థులు మంత్రముగ్ధులయ్యారు.

News November 5, 2024

మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం: పవన్ కళ్యాణ్

image

యు.కొత్తపల్లి మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం చూపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గొల్లప్రోలులో జరిగిన సమావేశంలో ఆయన ఈ సమస్యలపై ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులను వివరాలు తెలుసుకున్నారు. వారు అరబిందో ఫార్మా కంపెనీ వ్యర్థాలను సముద్రంలో విడుదల చేయడం వల్ల మత్స సంపద నశిస్తుందని ఆయన దృష్టికి వచ్చారు. దీనిపై ఫార్మా కంపెనీ అధికారులు, మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు