News February 7, 2025

వైభవంగా మహా కుంభాభిషేకం ప్రారంభం

image

కాళేశ్వర క్షేత్రంలో మహా కుంభాభిషేకం వైభవంగా ప్రారంభమైంది. వేద పండితులు అచలాపురం రిత్వికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత అరుదైన ఘట్టానికి శ్రీకారం జరిగింది. కుంభాభిషేక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని, ముందుకు సాగే విధంగా కార్యాచరణను అధికారులు రూపొందించారు.

Similar News

News February 7, 2025

KMR: స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటిన పోలీసులు

image

TG పోలీస్ నిర్వహించిన గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌ క్రీడల్లో కామారెడ్డి పోలీసులు సత్తా చాటారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సింధుశర్మ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు క్రీడాకారులను అభినందించారు. జిల్లా పోలీసు శాఖకు వివిధ విభాగాల్లో 2 బంగారు పతకాలు, 5 రజత, 3 కాంస్యం పతకాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.

News February 7, 2025

HYD: ప్రజాభవన్ ప్రజావాణికి 4,901 దరఖాస్తులు

image

మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 4,901 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 157, విద్యుత్ శాఖకు సంబంధించి 105, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 30, ఇందిరమ్మ ఇండ్లు పథకం కోసం 2,865 దరఖాస్తులు వచ్చాయి. పౌర సరఫరాల శాఖకు సంబంధించి 1,640 (రేషన్ కార్డులు) దరఖాస్తులు వచ్చాయి.

News February 7, 2025

వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ నియామకం

image

వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ కార్యవర్గ సమావేశం శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఆచార్య రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా పరుశరాములు, మహిళా విభాగానికి అధ్యక్షులుగా సంయుక్త, ప్రధాన కార్యదర్శిగా సరళను నియమిస్తూ సంస్థ ఛైర్మన్ మొహమ్మద్ సిరాజుద్దీన్ నియామక పత్రాలను అందజేశారు.

error: Content is protected !!