News February 13, 2025

వైభవంగా రంగనాయక స్వామి వారి కళ్యాణం

image

భద్రాచలం రామాలయం అనుబంధ ఆలయమైన రంగనాయక స్వామి వారి ఆలయంలో మాఘ పూర్ణిమను పురస్కరించుకొని బుధవారం గోదా రంగనాయక స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామి వారికి మేళతాళాలు మంగళ వాయిధ్యాలు, వేద మంత్రాలు నడుమ రాజ వీధిలో తిరువీధి సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News

News October 18, 2025

PDPL: నేటితో ముగియనున్న గడువు

image

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మంథని, సుల్తానాబాద్, పెద్దపల్లి, రామగుండం జోన్‌లలో 74 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఇప్పటివరకు 566 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి తెలిపారు. నిన్న ఒక్కరోజులోనే 348 వచ్చాయన్నారు. నేటితో దరఖాస్తుల గడవు ముగియనుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

News October 18, 2025

7,565 కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

image

ఇంటర్ అర్హతతో 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3రోజులే ఉంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. 18-25 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, PE&MT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. <>వెబ్‌సైట్:<<>> https://ssc.gov.in/

News October 18, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతిపై రంగారెడ్డి కలెక్టర్ సమీక్ష

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్పష్టమైన పురోగతి సాధించాలని రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అధికారులతో ఇబ్రహీంపట్నంలోని కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. మండలాల వారీ మంజూరైన ఇళ్ల సంఖ్య, గ్రౌండింగ్, నిర్మాణ దశల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెనుకంజలో ఉన్న మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.