News March 24, 2025
వైభవంగా శ్రీమన్యాయసుధ మంగళ మహోత్సవం

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో శ్రీమన్యాయసుధా మంగళ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఇతర మఠాల పీఠాధిపతులతో కలిసి దీప ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా గంధాన్ని శోభాయాత్ర చేశారు. వేదికపై శ్రీమన్యాయసుధ విద్యార్థుల అనువాదం అనంతరం అంతర్ దృష్టితో కూడిన వాఖ్యార్థ ఘోష్టి నిర్వహించారు.
Similar News
News March 30, 2025
కర్నూలు జిల్లాలో చికెన్ ధర రూ.200

కర్నూలు జిల్లాలో పలు చోట్ల చికెన్ ధర రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, తదితర ప్రాంతాల్లో లైవ్ కోడి కిలో రూ.120 ఉండగా.. స్కిన్ రూ.180, స్కిన్ లెస్ రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. 2 నెలల క్రితం రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో చికెన్ అమ్మకాలు తగ్గి, మటన్, చేపల విక్రయాలు పెరిగాయి. దీంతో కిలో మటన్ రూ.900, చేపలు రూ.300 చొప్పున అమ్ముతున్నారు.
News March 30, 2025
కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి

మార్చి 31న రంజాన్ పండుగ ను పురస్కరించుకొని సోమవారం పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమంను రద్దు చేస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలతో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
News March 30, 2025
ఒకే కుటుంబంలో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు

క్రిష్ణగిరి మండల పరిధిలోని పెనుమాడలో ఇటీవల విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలలో ఒకే కుటుంబంలో 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇందులో ఇద్దరు అసిస్టెంట్ లోకో పైలట్, ఇద్దరు జిల్లా కోర్టులో ప్రాసెస్ సర్వర్, ఒకరు ఏపీ హైకోర్టులో సబర్డినేట్ ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామంలో ఉద్యోగాలు రావడంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు.