News August 9, 2024

వైయస్సార్ జిల్లాలోని 34 మంది ఎస్బీ సిబ్బంది బదిలీ

image

వైయస్సార్ జిల్లా వ్యాప్తంగా 34 మంది స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు ఏఎస్ఐలు, 16 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 15 మంది పోలీస్ కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వీరు బదిలీ అయిన కొత్త ప్రాంతాల్లో వెంటనే జాయిన్ కావాలని ఆదేశించారు.

Similar News

News November 18, 2025

గండికోటలో ప్రమాదాల అంచున సెల్ఫీ

image

గండికోట ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. యువకులు, విద్యార్థులు, పెద్దలు, కొందరు పర్యాటకులు గండికోటను దర్శిస్తుంటారు. ఇక్కడ లోయ ఉండడంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంటుంది. రెండు కొండల మధ్య లోయ చుపరులను ఆకట్టుకుంటూ కనువిందు చేస్తుంటుంది. ఈ దృశ్యాన్ని తిలకిస్తూ ప్రమాదపు అంచున ఫొటోలు దిగుతూ ఉంటారు. అధికారులు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ సుధీర్ రెడ్డి కేనా..?

image

మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాలిటిక్స్‌లో మళ్లీ యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు పార్టీ కార్యక్రమాలు కొన్నింట్లో పాల్గొని, మరి కొన్నింట్లో కనిపించకుండా పోయారు. దీంతో ఆయన పాలిటిక్స్‌కు దూరం అయ్యారనే గుసగుసలు వినిపించాయి. అయితే వారం రోజుల నుంచి ఆయనకు సంబంధించిన అభిమానులు, నాయకులు ‘BOSS IS BACK’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆయనకే నియోజకవర్గ బాధ్యతలు కూడా ఇస్తారనే టాక్ నడుస్తోంది.