News January 11, 2026

వైరలవుతున్న 365 Buttons ట్రెండ్.. ఏంటిది?

image

ఇప్పుడు SMలో 365 Buttons అనే కొత్త ట్రెండ్ వైరలవుతోంది. 365 బటన్స్ కొని రోజుకు ఒకటి పక్కన పెడతానని.. అవి తన సమయాన్ని, బాధ్యతను గుర్తుచేస్తాయని తమారా అనే యూజర్ 2025 చివర్లో పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్లు బటన్లే ఎందుకు? లాభమేంటి? అంటూ ఆరాతీశారు. దానికి ఆమె ‘నాకర్థమైతే చాలు. ఎవరికీ వివరణ ఇవ్వక్కర్లేదు’ అని సమాధానమిచ్చారు. దీంతో సొంత నిర్ణయాలకు ఇతరుల అనుమతి అక్కర్లేదనే అర్థంలో ఈ ట్రెండ్ వైరలవుతోంది.

Similar News

News January 19, 2026

‘దండోరా’పై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు

image

శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ సినిమాపై హీరో Jr NTR ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా గాఢమైన భావోద్వేగాలతో ఆలోచింపజేసే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. నటీనటులందరి ప్రదర్శన అద్భుతమని తెలిపారు. దర్శకుడు మురళీకాంత్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ఈ సినిమా JAN 14 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

News January 19, 2026

గంటా 45 నిమిషాల మీటింగ్ కోసం 6 గంటల ప్రయాణం.. ఏదో ఉంది?

image

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ UAE అధ్యక్షుడు అల్ నహ్యాన్ భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం గంటా 45 నిమిషాల కోసం ఆయన ఆరు గంటలు ప్రయాణించడం గమనార్హం. ఇరాన్ కల్లోలం, సౌదీ-UAE మధ్య యెమెన్ చిచ్చు, గాజా శాంతి చర్చల వంటి ఇష్యూస్‌ నేపథ్యంలో ఫోన్లో కాకుండా నేరుగా చర్చించేంత బలమైన విషయమేదో ఉందని దౌత్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారత్‌ను బలమైన భాగస్వామిగా UAE నమ్ముతోంది.

News January 19, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, BRS నేత హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉ.11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు రావాలని అందులో పేర్కొంది. హరీశ్ పాత్రపై ఓ ప్రైవేటు ఛానెల్ ఎండీ స్టేట్‌మెంట్ మేరకు ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన ఈ కేసులో BRS కీలక నేతకు నోటీసులు రావడం సంచలనంగా మారింది. అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేదా? అనేది ఆసక్తిగా మారింది.