News July 25, 2024
వైరా ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి విషెస్

వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో నిమగ్నమై, రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా పాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అటు పలువురు జిల్లా నేతలు ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News January 8, 2026
ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 10,552 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, ఎలాంటి కొరత లేదని గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా సరఫరా కోసం మార్క్‌ఫెడ్ ద్వారా ప్యాక్స్, ప్రైవేట్ డీలర్లకు నిల్వలు చేరవేసే చర్యలు చేపట్టామని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో 29,178 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
News January 8, 2026
ఖమ్మం జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీగా ఏదులాపురం!

ఖమ్మం రూరల్ మండలంలోని 12 పంచాయతీలతో ఏర్పడిన నూతన ఏదులాపురం మున్సిపాలిటీ, జిల్లాలోనే అత్యధిక ఓటర్లు (45,256), వార్డులు (32) కలిగిన పురపాలికగా నిలిచింది. ఎన్నికల నేపథ్యంలో అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. 26 అభ్యంతరాలు రాగా, బీఎల్ఓల విచారణ అనంతరం ఈ నెల 10న తుది జాబితా ప్రకటించనున్నారు. అత్యధికంగా ఒకటో వార్డులో 1,710 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
News January 8, 2026
ఖమ్మంలో రేపు జాబ్ మేళా

ఖమ్మం: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.శ్రీరామ్ తెలిపారు. ఫార్మసీ కోర్సులు చేసిన వారితో పాటు పదో తరగతి, ఇంటర్ అర్హత ఉన్న వారు కూడా హాజరుకావచ్చు. నెలకు రూ.25 వేల వరకు జీతం పొందే అవకాశం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు మేళాకు రావాలని ఆయన కోరారు.


