News December 18, 2024
వైరా: తండ్రి ఇరుముడికి వచ్చి అనంత లోకాలకు..

వైరాలోని రింగ్ రోడ్డులో జరిగిన <<14914865>>రోడ్డు ప్రమాదం<<>>లో లారీ కిందపడి బాలిక మృతిచెందిన విషయం తెలిసిందే. రఘునాథపాలెం మండలం కోయచిలుకకి చెందిన చెరుకూరి హర్షశ్రీ(13) వైరా గురుకులంలో 7వ తరగతి చదువుతోంది. తండ్రి ఇరుముడి కోసం ఇంటికి వచ్చి బైక్పై మేనమామ శ్రీకాంత్తో తిరుగు ప్రయాణమైంది. వైరా రింగ్ రోడ్డులో ట్రాక్టర్ను తప్పించబోయి లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఎస్ఐ వంశీకృష్ణ కేసు నమోదు చేశారు.
Similar News
News November 24, 2025
ఖమ్మం: శ్రీ చైతన్య కాలేజ్ ఎదుట విద్యార్థుల ఆందోళన

ఖమ్మం శ్రీ చైతన్య జూనియర్ కళాశాల హాస్టల్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. సుమారు 250 మంది విద్యార్థులు ప్లేట్లు పట్టుకుని, క్యాంపస్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. లక్షల ఫీజులు చెల్లించినా రుచిలేని భోజనం పెడుతున్నారని, ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
News November 24, 2025
రేపు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు: భట్టి

రేపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సీఎస్ కే.రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశంపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. చీరల పంపిణీ, స్కాలర్షిప్లు, పీఎంఏవై అంశాలపై చర్చించారు.
News November 24, 2025
KMM: సదరం సర్టిఫికెట్ ఉన్నా పెన్షన్ రాక ఆందోళన

ఖమ్మం జిల్లాలో సదరం సర్టిఫికెట్లు పొందిన వికలాంగులు రెండేళ్లుగా పెన్షన్లు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు మంజూరు కాకపోగా, తీసుకున్న సర్టిఫికెట్ల గడువు ముగిసిపోతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, అర్హులైన వికలాంగులకు పెండింగ్లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.


