News February 12, 2025

వైరా: నిలిచిపోయిన బీర్ల సరఫరా!

image

వైరాలోని IMFL డిపో నుంచి మంగళవారం బీర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.150గా ఉన్న లైట్ బీర్ బాటిల్ ధర రూ.180కి, స్ట్రాంగ్ బీర్ బాటిల్ ధర రూ.40 మేర పెంచుతూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువరించింది. అయితే నిన్న మధ్యాహ్నం వరకు స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో బార్లు, వైన్స్‌ల నిర్వాహకులు బీర్ల స్టాక్ తీసుకెళ్లలేదు. బుధవారం స్టాక్ తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 3, 2025

పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం: ఖమ్మం సీపీ

image

దట్టమైన పొగమంచు సమయాల్లో వాహన ప్రయాణం ప్రమాదకరమని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారని, పొగమంచు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్టిలో పెట్టుకొని స్వల్ప నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News December 3, 2025

పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 20.5 అడుగులు

image

కూసుమంచి మండలం పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 20.5 అడుగులకు చేరింది. ఈ సందర్బంగా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 20.5 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి జలాశయానికి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం నుంచి కింది కాల్వకు, తాగునీటికి నీటిని వినియోగిస్తున్నారు.

News December 3, 2025

ఖమ్మం: అర్ధరాత్రి పొద్దుపోయేంతవరకు నామినేషన్లు

image

ఖమ్మం జిల్లాలో రెండో విడత నామినేషన్ల దాఖలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి పొద్దుపోయేంతవరకు నామినేషన్లు దాఖలు చేశారు. 6 మండలాల్లో మొత్తం 183 గ్రామపంచాయతీలకు గాను 1055 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా 1686 వార్డులకు గాను 4160 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కూసుమంచి మండలంలో అత్యధికంగా సర్పంచ్ పదవికి 250 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.