News April 15, 2024
వైరా: నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
నీటితొట్టిలో పడి చిన్నారి మృతిచెందిన ఘటన వైరా మండలం కేజీ సిరిపురంలో చోటుచేసుకుంది. కూరాకుల గోపి, భవాని దంపతులకు ఇద్దరు కుమారులు. వృత్తి రీత్యా తండ్రి కూరాకుల గోపి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లి వైరాలోని ఒక షాపులో వర్కర్ గా పని చేస్తుంది. ఈ క్రమంలో చిన్న కుమారుడు యశ్వంత్ (16 నెలలు) వారి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్న సమయంలో అదుపుతప్పి సమీపంలో ఉన్న నీటితొట్టిలో పడిపోయి మృతి చెందాడు
Similar News
News November 5, 2024
కొత్తగూడెం: ఫుడ్ డెలివరీ బాయ్ సూసైడ్
కొత్తగూడెం మున్సిపాలిటీ చిట్టిరామవరం తండాకు చెందిన అజ్మీర శివ(24) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాలిలా.. వ్యవసాయ పనుల నిమిత్తం వారి తల్లిదండ్రులు ఉదయం పొలాలకు వెళ్లిపోయారు. కాగా సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉరి వేసుకుని ఉన్నట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతం ఆ యువకుడు కొత్తగూడెం టౌన్లో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడని చెప్పారు.
News November 5, 2024
ఖమ్మం: రైలు నుంచి జారిపడి యువకుడు మృతి
మధిర-మోటమర్రి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువకుడు మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని, మృతుడు మెరూన్ రంగు షర్ట్, నీలం జీన్స్ ప్యాంట్ ధరించినట్లు చెప్పారు. మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచినట్లు చెప్పారు. ఖమ్మం జి.ఆర్.పి.సి భాస్కర రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 5, 2024
చింతకాని: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు
చింతకాని మండలంలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రతిభను చాటుకున్నారు. డీఎస్సీ 2024లో ఈ కుటుంబానికి చెందిన ముగ్గురు సూపర్ సక్సెస్ సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా జాబ్ కొట్టారు. ఈలప్రోలు కృష్ణారావు స్కూల్ అసిస్టెంట్‌గా, ఆయన సోదరుడు నరేష్, సోదరి సునీతలు ఎస్‌జీటీ పోస్టుల్లో సెలెక్ట్ అయ్యి విధుల్లో చేరారు. గ్రామస్థులు, బంధుమిత్రులు వారికి అభినందనలు తెలిపారు.