News July 31, 2024

వైరా: భార్య ఊరెళ్లిందని భర్త ఆత్మహత్య

image

వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన షేక్ ఖాసీమ్ సాహెబ్(40) అతిగా మద్యం తాగే విషయమై ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. విభేదించిన భార్య ఇమామ్జీ కొద్ది రోజుల క్రితం తన సోదరి ఇంటికి వెళ్లి అక్కడే ఉంటుంది. దీంతో మనస్తాపానికి గురైన ఖాసీమ్ సాహెబ్ ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News January 20, 2026

ఖమ్మం: బాలికపై లైంగికదాడికి యత్నం

image

ముదిగొండ మండలంలో దారుణం జరిగింది. మాయమాటలతో బాలికను కిడ్నాప్ చేసిన గోపి అనే యువకుడు, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. అమ్మాయి కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ అశోక్ కేసు నమోదు చేశారు. నిందితుడిపై కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

News January 20, 2026

ఖమ్మంలో పూడ్చిపెట్టిన మహిళ మృతదేహానికి పోస్టుమార్టం

image

ఖమ్మం రమణగుట్టలో సంచలనం రేపిన శైలజ(26) మరణంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనారోగ్యంతో మరణించిందని నమ్మించి భర్త సురేందర్ హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించగా, అనుమానం వచ్చిన మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ పర్యవేక్షణలో సోమవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. వివాహేతర సంబంధం కోసమే ఇంజెక్షన్‌తో భార్యను హతమార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

News January 19, 2026

ఖమ్మం: ‘గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పనిచేయాలి’

image

సర్పంచ్ పదవిని కేవలం హోదాగా కాకుండా ఒక బాధ్యతగా భావించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహించిన శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, పచ్చదనం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకూ చేరేలా సర్పంచులు క్రియాశీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు.