News September 10, 2024
వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌లో వనపర్తి ఫోటో గ్రాఫర్

వనపర్తికి చెందిన ఎస్వీ రమేష్(నవీన ఫోటో పార్లర్) ప్రతిభ చాటారు. సౌత్ ఆఫ్రికాలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ185 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా 15 రోజు నిర్వహించిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. అక్కడ చిత్రాలను ఆకర్షణీయంగా చిత్రీకరించిన ఆయన ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌లో చిత్రాలను ప్రదర్శించి ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు ఆయనకు అభినందనలు తెలిపారు.
Similar News
News February 23, 2026
MBNR: సౌత్ జోన్.. పీయూలో చెస్ ఎంపికలు

పీయూలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు చెస్ (పురుషుల) ఎంపికలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ జీఎన్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. యూనివర్సిటీలో అన్ని సదుపాయాలు ఉన్నాయని, క్రీడాకారులు ప్రతిభ చాటి యూనివర్సిటీకి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ పూస రమేశ్ బాబు, పీడీ డా.వై.శ్రీనివాసులు, కోచ్‌లు పాల్గొన్నారు. ఎంపికైన వారు మార్చి 1న నుంచి తమిళనాడులో జరిగే టోర్నీలో పాల్గొననున్నారు.
News February 22, 2026
పాలమూరు: సీఎం కప్ నెట్‌బాల్ ఫైనల్‌కు నారాయణపేట జట్టు

మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న రెండో రాష్ట్రస్థాయి సీఎం కప్-2026 నెట్‌బాల్ పోటీల్లో నారాయణపేట జిల్లా బాలుర జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు డా. శెట్టి రమేశ్, డా. రామ్మోహన్ గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. రేపు జరగబోయే తుది పోరులో జట్టు విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.
News February 21, 2026
పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

✒ MBNR: క్రీడలతోనే మానసిక స్థైర్యం – ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
✒ MBNR:AIU వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పీయూ వీసీ
✒ నాగర్‌కర్నూల్‌లో రోడ్డు ప్రమాదం.. కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
✒ ఈనెల 21న బడుల్లో పేరెంట్స్ మీటింగ్: డీఈవో
✒ NGKL:SLBC పనులు ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
✒ పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒ ఇంటర్ పరీక్షలపై ప్రత్యేక ఫోకస్


