News March 20, 2025

వైవియూ దూరవిద్య కోర్సుల ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

image

కడప: యోగి వేమన యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ద్వారా పలు కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ కె. కృష్ణారెడ్డి తెలిపారు. వైవీయూ అధ్యయన కేంద్రాల్లో ఎం.ఏ. ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, తెలుగు, ఎం.కామ్. కోర్సులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్. రఘునాథరెడ్డి, రిజిస్ట్రార్ పద్మ పాల్గొన్నారు.

Similar News

News December 6, 2025

అన్నమయ్య కాలిబాట విషయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం పిల్లి: శ్యామల

image

అన్నమయ్య కాలిబాటపై ఆంక్షలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొమరం పులే గాని కాలిబాట విషయంలో పిఠాపురం పిల్లిలా ప్రవర్తించారని YCP రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి శ్యామల తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం నడింపల్లికి చేరుకున్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాదయాత్రకు ఆమె సంఘీభావం తెలిపారు. అనంతరం ఆమె అన్నమయ్య కాలిబాటపై ఆంక్షలు విధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని విమర్శించారు.

News December 6, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు.!

image

ప్రొద్దుటూరులో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,740
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ. 11,721
☛ వెండి 10 గ్రాములు ధర: రూ.1780.0=

News December 6, 2025

కడప: ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలపై GST దాడులు.!

image

కడప జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్, ట్రావెల్ కార్యాలయాలపై శుక్రవారం జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. CTO జ్ఞానానందరెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో, CTO రాజనరసింహారెడ్డి ఆధ్వర్యంలో కడపలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పన్నులు చెల్లించకుండా రవాణా అవుతున్న వస్తువులను గుర్తించారు. వాటిని సీజ్ చేశారు. పెనాల్టీ విధించారు. ప్రొద్దుటూరులో 4 ట్రాన్స్‌పోర్ట్, 3 ట్రావెల్ కార్యాలయాలపై దాడులు జరిగాయి.