News October 14, 2024
వైవీయూ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ రాజీనామా ఆమోదం
యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యులు తప్పెట రామ ప్రసాద్ రెడ్డి ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా విధుల నుంచి రిలీవ్ చేయాలని ఉపకులపతిని కొద్దిరోజుల కిందట కలిసి కోరారు. ఆయన విజ్ఞాపన మేరకు విధుల నుంచి రిలీవ్ చేసినట్టు వైవీయూ ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి వెల్లడించారు.
Similar News
News October 15, 2024
తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కడప కలెక్టర్
రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను కారణంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News October 14, 2024
కడప: డిగ్రీ ఒకేషనల్ పరీక్షలు వాయిదా
యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో ఈనెల 15వ తేదీ నుంచి జరగాల్సిన డిగ్రీ ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ప్రభావం అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలపై ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
News October 14, 2024
కడప: కమిషనర్ కార్యాలయంలో అర్జీలు స్వీకరణ
కడప నగర పరిధిలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ రాకేశ్ చంద్రం పేర్కొన్నారు. సోమవారం ఉదయం పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో అందించినట్లు చెప్పారు. మున్సిపాలిటీ సిబ్బంది చేత సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.