News August 26, 2024
వైసీపీకి ఏలూరు మేయర్ రాజీనామా
ఏలూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె పార్టీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖ పంపించారు. పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అలాగే నూర్జహాన్‌తో పాటు ఆమె భర్త, కో-ఆప్షన్ సభ్యుడు పెదబాబు సైతం వైసీపీకి రాజీనామా చేశారు.
Similar News
News September 7, 2024
ప.గో.: వరదలపై సీఎం చంద్రబాబు ఆరా
కొల్లేరులో వరద ఉద్ధృతి, ఉప్పుటేరు ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ముఖ్యమంత్రి కొల్లేరు, ఉప్పుటేరు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసే అవకాశం ఉందని సమాచారం అందడంతో పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఉప్పుటేరులో ప్రవాహానికి అడ్డంకులను తొలగించే పనులు ముమ్మరం చేయించారు.
News September 7, 2024
ఊటుకూరులో పట్టపగలే దారుణ హత్య
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం ఊటుకూరులో శనివారం పట్టపగలే దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన పోసిన బాల కోటయ్య (55)ను మారణాయుధాలతో దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ముదినేపల్లి పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
News September 7, 2024
ప.గో.: భార్య చేపలకూర వండలేదని భర్త సూసైడ్
భార్య చేపల కూర వండలేదని అలిగి ఉరేసుకున్న వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు మొగల్తూరు ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు. వివరాలు.. మండలంలోని ముత్యాలపల్లి చెందిన మైల సుబ్బరాజు (38) గత నెల 22న తన భార్యను చేపలకూర వండమని చెప్పారు. ఆమె వండకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబీకులు కాకినాడ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ చనిపోయాడు.