News June 28, 2024

వైసీపీకి డాక్టర్ టీవీ రావు రాజీనామా

image

వ్యాపారవేత్త, దాక్షిణ్య సంస్థ వ్యవస్థాపకుడు, వైసీపీ నేత డాక్టర్ టీవీ రావు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. ఏపీ స్టేట్ గ్రూప్ వన్ అధికారిగా పని చేసిన ఆయన స్వచ్ఛంద పదవి విరమణ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున 2004 గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆపై వైసీపీలో చేరి, తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Similar News

News December 5, 2025

కేఎల్‌యూలో నేడు ‘ఉద్భవ్-2025’ ముగింపు సంబరాలు

image

వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్న 6వ జాతీయ ఏకలవ్య సాంస్కృతిక ఉత్సవాలు ‘ఉద్భవ్-2025’ నేటితో ముగియనున్నాయి. గిరిజన సంక్షేమ గురుకులాల ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు ముగింపు వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేశ్, డోలా బాలవీరాంజనేయస్వామి, గుమ్మడి సంధ్యారాణి అతిథులుగా హాజరవుతారు. గిరిజన విద్యార్థుల కళా ప్రదర్శనల అనంతరం, చేతులకు బహుమతులు అందించనున్నారు.

News December 5, 2025

GNT: సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఆదేశాలు

image

సీజనల్ వ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. ధాన్యం కొనుగోలు, ఎరువుల లభ్యత, సీజనల్ వ్యాధుల నియంత్రణ ఇతర ప్రాధాన్య ఆరోగ్య అంశాలపై గురువారం సచివాలయం నుంచి విజయానంద్ అన్నీ జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఎరువుల కొరత లేకుండా చూడాలని చెప్పారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం నుంచి కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ వీసీలో పాల్గొన్నారు.

News December 4, 2025

APCRDA “గ్రీవెన్స్ డే” నిర్వహణలో స్వల్ప మార్పు

image

అమరావతిలో తుళ్లూరు CRDA కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించబడుతున్న గ్రీవెన్స్ డే.. ఇకపై ప్రతి శనివారం రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలో నిర్వహించబడుతుందని CRDA అధికారులు ఓ ప్రకటనలో చెప్పారు. ప్రతి శనివారం – రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గ్రీవెన్స్ డే నిర్వహించబడుతుందన్నారు. రాజధాని ప్రాంత రైతులు ఈ మార్పును గమనించాలని కోరారు.