News December 12, 2024

వైసీపీకి భీమవరం మాజీ MLA రాజీనామా?

image

ప.గో జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలినట్లు సమాచారం. భీమవరం మాజీ MLA గ్రంధి శ్రీనివాస్ ఆ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఓటమి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు. అయితే ఆయన భవిష్యత్ కార్యాచరణ తెలియాల్సి ఉంది.

Similar News

News January 16, 2025

ప.గో: పందెంలో మీకు ఏం వచ్చింది?

image

గోదావరి జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల్లో మూడు రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. కొందరు లాభ పడగా.. మరికొందరు ఎంతో నష్టపోయారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కార్లను సైతం కుదవ పెట్టేశారట. కొందరు నెల జీతం మొత్తాన్ని క్షణాల్లో పోగొట్టేసుకున్నారు. మరికొందరు స్థలాలను సైతం తాకట్టు పెట్టేశారు. మీ పరిధిలో ఎవరైనా ఇలా నష్టపోయారా? లాభపడ్డారా? తెలిస్తే కామెంట్ చేయండి.

News January 16, 2025

మొగల్తూరులో కొత్త అల్లుడికి 200 రకాల పిండి వంటలతో విందు

image

మొగల్తూరులో బుధవారం సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుడికి 200 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. మొగల్తూరుకి చెందిన విష్ణు ప్రియ, గుంటూరుకు చెందిన త్రిపురమల్లు వైష్ణవ్‌లకు గత ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. తొలి పండుగకు అల్లుడితో పాటు కుటుంబ సభ్యులను విష్ణు ప్రియ తల్లిదండ్రులు ఫణి, ఝాన్సీలు ఆహ్వానించారు.  వైష్ణవ్‌కు 200 రకాల పిండివంటలతో విందు ఏర్పాటు చేసి మర్యాద చేశారు.

News January 16, 2025

ప.గో: మూడు రోజులు…రూ.1000 కోట్లు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన కోడి పందాలు కూడా ముగిశాయి. ఈసారి కోడిపందాలు భారీ స్థాయిలో జరిగాయి. మొత్తం 3 రోజులుగా కోడిపందాలు, గుండాట, పేకాట మొత్తం కలిపి సుమారు రూ.1000 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు.