News March 19, 2025
వైసీపీకి మర్రి రాజశేఖర్ రాజీనామా

YCPకి MLC మర్రి రాజశేఖర్ రాజీనామా చర్చనీయాంశమైంది. 2004లో చిలకలూరిపేటలో ఇండిపెండెంట్గా గెలిచిన ఆయన 2010లో YCPలో చేరారు. 2014లో MLAగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం YCP జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2018లో జగన్ పాదయాత్రలో కీలకంగా పనిచేశారు. కాగా 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా విడదల రజనీ ఉన్నారు. పార్టీలో గుర్తింపు లేదని ఆయన అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.
Similar News
News December 8, 2025
PGRS అర్జీల స్థితిని 1100 ద్వారా తెలుసుకోవచ్చు: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో సమర్పించిన అర్జీల స్థితిని టోల్ ఫ్రీ 1100 ద్వారా తెలుసుకోవచ్చని గుంటూరు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. అర్జీలను మీకోసం వెబ్సైట్లో లేదా నేరుగా కూడా అందించవచ్చని సూచించారు. కలెక్టరేట్, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News December 7, 2025
గుంటూరు జిల్లాలో 600కు పైగా రోడ్డు ప్రమాదాలు

ఈ ఏడాది గుంటూరు జిల్లాలో 600కు పైగా రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్, హెల్మెట్/సీట్ బెల్ట్ ధరించకపోవడం ప్రధాన కారణాలుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 6-9, మధ్యాహ్నం 3-6 సమయాల్లో ప్రమాదాలు అధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మోర్త్ దేశవ్యాప్తంగా అత్యధికంగా ప్రమాదాల జరుగుతున్న టాప్ 100 జిల్లాల జాబితాలో గుంటూరు 71వ స్థానంలో నిలిచింది.
News December 7, 2025
మహానటి సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మాణం: MP బాలశౌరి

మహానటి సావిత్రి పేరుతో ఆమె జన్మస్థలమైన గుంటూరు (D) తాడేపల్లి (M) చిర్రావూరులో కళ్యాణ మందిరం నిర్మించనున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. NTPC వారి సీఎస్ఆర్ నిధులు కింద రూ.2 కోట్లు మంజూరు చేశారన్నారు. గతంలో తాను తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో చిర్రావూరులో సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మించాలని సంకల్పించినట్లు ఆమె 90వ జయంతి సందర్భంగా బాలశౌరి తెలిపారు.


