News April 17, 2024
వైసీపీకి రాజీనామా చేసిన రాజంపేట ముఖ్య నేతలు
రాజంపేట నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజంపేట మైనార్టీ నేత గండికోట గుల్జార్ భాష రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి, వైసీపీకి బుధవారం రాజీనామా చేశారు. నందలూరుకు చెందిన భువనబోయిన లక్ష్మీనరసయ్య రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. మైనార్టీ నాయకుడు సయ్యద్ అమీర్ వక్ఫ్ బోర్డ్ సెక్రటరీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారని తెలిపారు.
Similar News
News September 17, 2024
ఎన్ఎంసీకి సీఎం లేఖ రాయడం దుర్మార్గం: తులసి రెడ్డి
మౌలిక వసతులు, సిబ్బంది కొరత సాకులు చూపి పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ మంజూరు చేసిన 50 సీట్లు వద్దని సీఎం లేఖ రాయడం దుర్మార్గమని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంపల్లిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సగం ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కొరత ఉందన్నారు. ఆ మాత్రాన వీటిని మూసేస్తారా అని ప్రశ్నించారు. ఎన్ఎంసీకి అండర్ టేకింగ్ లెటర్ ఇచ్చి మెడికల్ కళాశాల ప్రారంభించాలని కోరారు.
News September 17, 2024
తొండూరు బ్రిడ్జిపై రెండు లారీలు ఢీ
తొండూరు బ్రిడ్జిపై అతివేగంగా వస్తున్న రెండు సిమెంట్ లారీలు వెనకనుంచి ఒకదానికొకటి ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న తొండూరు ఎస్సై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
News September 17, 2024
కడప: తెగిపడిన యువకుడి చెయ్యి
నందలూరు రైల్వే కేంద్రంలో రైలు కింద పడి యువకుడి చెయ్యి తెగిపడిపోయిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గుంతకల్లుకు చెందిన కురుబ ధనుష్ పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. రైలులో పుత్తూరుకు వెళుతూ నందలూరుకు రాగానే ప్రమాదవశాత్తు రైలు కింద పడి చెయ్యి విరిగింది. క్షతగాత్రుడిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.