News August 7, 2024

వైసీపీకి రాజీనామా చేసిన పిఠాపురం మాజీ MLA

image

పిఠాపురం మాజీ MLA పెండెం దొరబాబు YCPకి బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా తనను వెన్నంటి నడిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి స్వలోభాలకు ఆశపడి రాజీనామా చేయలేదన్నారు. వెన్నుపోటు రాజకీయాలు చేయడం తమకు తెలియదన్నారు. వీలైనంత త్వరలో భవిష్యత్ ప్రణాళికను తెలియజేస్తానని చెప్పారు.

Similar News

News November 18, 2025

రాజమండ్రి: ఒకేసారి రెండు పథకాల డబ్బులు..!

image

తూర్పు గోదావరి జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా 1,14,991 మంది లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు డీఏఓ ఎస్.మాధవరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ కింద రూ. 57.50 కోట్లు (ఒక్కో రైతుకు రూ. 5000), పీఎం కిసాన్ కింద రూ. 19.50 కోట్లు (ఒక్కో రైతుకు రూ. 2000) మంజూరయ్యాయి. మొత్తం రూ. 77 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

రాజమండ్రి: ‘ప్రశాంతంగా 10 పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలి’

image

రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అసిస్టెంట్ కమిషనర్ ఫర్ ఎగ్జామినేషన్స్ ఎం. అమల కుమారి అధికారులకు సూచించారు. సోమవారం ఆమె రాజమండ్రిలోని కంటిపూడి రామారావు మున్సిపల్ స్కూల్‌లోని పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర సదుపాయాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ రేంజ్ డీఐ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.