News April 27, 2024
వైసీపీది రియల్ మేనిఫెస్టో: తమ్మినేని
ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో రియల్ మేనిఫెస్టో అని రాష్ట్ర శాసనసభ స్పీకర్, ఆమదాలవలస వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలను కష్టాల నుంచి బయటపడేసే విధంగా జగన్ మేనిఫెస్టో ఉందని, చంద్రబాబు మేనిఫెస్టో అంతా కాపీ పేస్ట్ మాదిరిగా ఉంటుందన్నారు.
Similar News
News November 9, 2024
శ్రీకాకుళం జిల్లాలో TODAY TOP NEWS
* శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 900 సీసీ కెమెరాలు: SP
* కోటబొమ్మాళి: టీడీపీ ప్రభుత్వం 400 మందిని తొలగించింది: పేరాడ తిలక్
* శ్రీకాకుళం జిల్లాకు ఇద్దరు డీఎస్పీల నియామకం
* ధాన్యం సేకరించిన 48 గంటల్లో నగదు జమ: మంత్రి అచ్చెన్న
* చట్ట పరిధిలోని ఫిర్యాదులను పరిష్కరిస్తాం: SP
* కంచిలిలో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు
* ITEP 2వ సెమిస్టర్ టైం టేబుల్ విడుదల
News November 9, 2024
శ్రీకాకుళం: ఫిర్యాదుల నమోదు కోసం టోల్ ఫ్రీ నంబర్
మాదక ద్రవ్యాల వినియోగం, వాటికి సంబంధించిన ఫిర్యాదుల నమోదు, అలాగే డి-అడిక్షన్ కేంద్రాల సేవలకు టోల్ ఫ్రీ నెంబర్ 14446 పని చేస్తోందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం జరిగిన (ఎన్‌సీఓఆర్‌డీ) సమావేశంలో తెలిపారు. రిమ్స్ ఆసుపత్రిలో డి-అడిక్షన్ సెంటర్ అందుబాటులో ఉందన్నారు. దాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు.
News November 8, 2024
రహదారి ప్రయాణంలో భద్రతే జీవితానికి రక్షణ: శ్రీకాకుళం కలెక్టర్
రహదారి ప్రయాణంలో భద్రతే జీవితాలకు రక్షణగా నిలుస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కమిటీ ఛైర్మన్‌గా, జిల్లా ఎస్పీ కెవి.మహేశ్వర రెడ్డి, కమిటీ మెంబర్ కన్వీనర్, డీటీసీ విజయ సారథి తదితరులు హాజరయ్యారు.