News June 30, 2024

వైసీపీని వీడిన దువ్వూరు

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. సూళ్లూరుపేట శ్రీచెంగాల పరమేశ్వరి ఆలయ మాజీ ఛైర్మన్ దువ్వూరు బాల చంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్‌ను వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పంపించారు. వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు వరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

Similar News

News December 12, 2024

దేశ ప్రధానిని కలిసి ఎంపీ వేమిరెడ్డి దంపతులు

image

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు.. ప్రధానమంత్రిని శాలువాతో సత్కరించారు. అనంతరం పుష్పగుచ్చం అందించారు.

News December 12, 2024

తిరుపతి జిల్లా విద్యాసంస్థలకు నేడు సెలవు

image

భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ నేడు సెలవు ప్రకటించారు. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలతో పాటు వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లె మండలాలకు మాత్రమే సెలవు వర్తిస్తుంది. నెల్లూరు జిల్లాలో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

News December 12, 2024

అనంతసాగరం: తండ్రి, కుమారుల గొడవ.. కొడుకు మృతి

image

అనంతసాగరం మండలం ఇనగలూరులో తండ్రి-కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కొడుకు మృతి చెందాడు. కొడుకు మస్తాన్ రోజు మద్యం సేవించి ఇంటికి వస్తుండేవాడు. దీనితో తండ్రి నబ్బీసాహెబ్ మందలించాడు. ఈ క్రమంలో తండ్రి పై కర్రతో దాడి చేయబోయి పక్కనే ఉన్న రాళ్ల పై పడి కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మస్తాన్ మృతి చెందాడు.