News March 20, 2024

వైసీపీలోకి వంగవీటి నరేంద్ర

image

కాపు సంఘం రాష్ట్ర నేత వంగవీటి నరేంద్ర బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నరేంద్ర ఇప్పటి వరకు బీజేపీలో పని చేశారు. ఈయన వంగవీటి రాధాకృష్ణకు సోదరుడు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ మిథున్‌రెడ్డి, కాపు సంఘం నేతలు పాల్గొన్నారు.

Similar News

News September 12, 2024

షర్మిలను కలిసిన కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణ

image

కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన గొల్లు కృష్ణ గురువారం విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. కృష్ణ మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఉంచిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయుటకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.

News September 12, 2024

విజయవాడ: నీటి గోతిలో ఇరుక్కుపోయిన మంత్రి కారు

image

విజయవాడలో మంత్రి నారాయణ, బొండా ఉమామహేశ్వరావుతో కలిసి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా వరద ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో మంత్రి నారాయణ కారు నీటి గోతిలో కూరుకుపోయింది. సిబ్బంది క్రేన్ సహాయంతో కారును గోతిలో నుంచి వెలికితీశారు. అనంతరం మంత్రి పర్యటన కొనసాగింది.

News September 12, 2024

విజయవాడ వరద బాధితులకు కీలక ప్రకటన

image

విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఎన్యుమరేషన్‌లో ఇబ్బంది ఎదురైతే ప్రజలు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం 0866- 2574454, VMC కార్యాలయం- 8181960909 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ జి.సృజన సూచించారు. ఇంటి వద్ద ఎన్యుమరేషన్‌ జరగని పక్షంలో ఈ నెల 12, 13 తేదీల్లో తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శిని సంప్రదించి చేయించుకోవాలని సూచించారు.