News December 23, 2024
వైసీపీలో కనిపించని సుచరిత ఆచూకీ

ఎన్నికల అనంతరం మాజీ హోం మంత్రి సుచరిత ఆచూకీ కనిపించడం లేదని జిల్లా ప్రజలు అంటున్నారు. ఎన్నికల్లో ఆమె పోటీ చేసిన తాడికొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి డైమండ్ బాబుకు అప్పగించారు. అప్పటి నుంచి సుచరిత పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోవడంతో ఆమె పార్టీ మారతారనే వార్తలు వచ్చాయి. కానీ పార్టీ మారేది లేదని అనారోగ్య కారణాల వల్ల సుచరిత దూరంగా ఉంటున్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు.
Similar News
News February 26, 2026
జిల్లాలో 20 కేంద్రాల్లో NEETపరీక్షలు: GNT కలెక్టర్

గుంటూరు జిల్లాలో 20 కేంద్రాల్లో NEETపరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో గుంటూరు, తెనాలి, మంగళగిరి, అమరావతిలో 20 కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. గురువారం న్యూ ఢిల్లీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు.
News February 26, 2026
సమర్థవంతంగా మ్యూటేషన్ చేయాలి: కలెక్టర్

తప్పులు లేని మ్యుటేషన్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. రెవెన్యూ అధికారుల సమావేశం గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మ్యుటేషన్ ఒకటికి రెండు సార్లు పరిశీలించి చేయాలన్నారు. మ్యుటేషన్ అనే అంశం రెవెన్యూ శాఖకు ప్రాథమిక విధి అన్నారు. ఎటువంటి తప్పులు దొర్లినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.
News February 26, 2026
డోలిమోతల నడుమ ప్రసవించడం బాధాకరం: రాయపాటి శైలజ

అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని మల్లిపాడు గ్రామానికి చెందిన సుమిత్ర డోలిమోతల నడుమ టార్చి లైట్ వెలుగుల్లో ప్రసవించడం బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. గిరిజన గర్భిణీలను ప్రసవానికి 15 రోజుల ముందే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చి వైద్యుల పర్యవేక్షణలో సుఖ ప్రసవా జరిగే కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు.


