News March 26, 2024
వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య వైసీపీ గూటికి చేరారు. ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేక వెంకట ప్రతాప్ అప్పారావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామకోటయ్య 2009లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి 5,143 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ అప్పారావుపై గెలిచారు.
Similar News
News March 18, 2025
కృష్ణా జిల్లాలో పేర్ల మార్పు రాజకీయం

కృష్ణా జిల్లాలో పేరు మార్పుల రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జగన్ హయాంలో NTR యూనివర్సిటీని YSR యూనివర్సిటీగా మార్చగా, కూటమి ప్రభుత్వం తిరిగి NTR పేరునే పెట్టింది. ఇప్పుడు YSR తాడిగడపను తాడిగడపగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా NTR స్వగ్రామమైన నిమ్మకూరు కృష్ణా జిల్లాలో ఉండగా దీనికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.
News March 18, 2025
తోట్లవల్లూరు: కోడి పందేల శిబిరంపై పోలీసుల దాడులు

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు, దేవరపల్లిలోని కోడి పందేల శిబిరంపై తోట్లవల్లూరు పోలీసుల సోమవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో 21 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.9 వేల నగదు, 3 కోడి పుంజులు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పమిడి ముక్కల సర్కిల్ పరిధిలో జూద క్రీడల్లో పాల్గొన్నా, నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ చిట్టిబాబు హెచ్చరించారు.
News March 18, 2025
కృష్ణా: పెండింగ్ పనులు పూర్తి చేయాలి- కలెక్టర్

మచిలీపట్నం కలెక్టరేట్‌లో కలెక్టర్ డీకే బాలాజీ తన ఛాంబర్‌లో గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఐసీడీఎస్, సీపీఓ, గనులు, జిల్లా పంచాయతీ తదితర శాఖల అధికారులతో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు, ఎంపీ లాడ్స్, జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్, జడ్పీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. సోమవారం కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల భవనాల మరమ్మతులకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.