News April 6, 2024
వైసీపీలో చేరిన శెట్టిబత్తుల రాజాబాబు

3 రోజుల కింద జనసేనకు రాజీనామా చేసిన అమలాపురం ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజాబాబు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో అమలాపురం నుంచి పోటీ చేసిన రాజాబాబు 45వేలకు పైగా ఓట్లు సాధించారు. ఈసారి పొత్తులో భాగంగా టికెట్ TDPకి ఇవ్వడంతో అసంతృప్తికి లోనయ్యారు. చివరకు ఈ రోజున వైసీపీ గూటికి చేరారు.
Similar News
News December 9, 2025
ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో క్రీడల ద్వారా ప్రతిభ: కలెక్టర్

ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో నమ్మకం, ధైర్యం, ప్రతిభను వెలికి తీయడంలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. రాజమండ్రిలోని ఎస్‌కేవీటీ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను కమిషనర్ ప్రారంభించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన చిన్నారుల్లో అపారమైన సృజనాత్మకత, ప్రత్యేక కౌశలాలు దాగి ఉన్నాయని వారు పేర్కొన్నారు.
News December 9, 2025
రతన్ టాటా హబ్‌లో ‘స్పార్క్’ కార్యక్రమం ప్రారంభం

రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో మంగళవారం స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ ఫర్ అడ్వాన్స్డ్ & రియల్‌టైమ్ నాలెడ్జ్ (‘స్పార్క్’) కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ వై.మేఘా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’ లక్ష్యాన్ని, ఇన్నోవేషన్ హబ్ దృష్టికోణాన్ని చేరుకోవడానికి ఈ ‘స్పార్క్’ కార్యక్రమం కీలక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
News December 9, 2025
తూ.గో: డిప్యూటీ సీఎం శాఖలో జీతాల కష్టాలు

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ శాఖలో ఉద్యోగులు జీతాలు అందక ఆకలి కేకలు వేస్తున్నారు.
తూ.గో జిల్లా నీటి నాణ్యత పరీక్షా కేంద్రాల సిబ్బందికి ఆగస్టు నుంచి ఐదు నెలల వేతనాలు అందలేదు. క్రిస్మస్, సంక్రాంతి సమీపిస్తున్న వేళ జీతాలు రాకపోవడంతో వేతన జీవుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వెంటనే బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.


